Telangana BJP: ఎంపీ అర్వింద్ సంచలన కామెంట్స్.. బీఆర్ఎస్, కాంగ్రెస్ కంటే..
By : Krishna
Update: 2023-10-17 06:30 GMT
ఎన్నికల షెడ్యూల్ రావడంతో తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ పొలిటికల్ హీట్ను పెంచుతున్నారు. ఈ క్రమంలో బీజేపీ ఎంపీ అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలను కొనడం కాంగ్రెస్ బీఆర్ఎస్ లకే తెలుసా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కంటే తమకు ఎక్కువ రాజకీయాలు వస్తాయని చెప్పారు.
తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని అర్వింద్ అన్నారు. ఎన్నికల తర్వాత బీజేపీలోకి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్యూ కడతారని.. తమను బీజేపీలోకి తీసుకోవాలని ధర్నాలు చేస్తారని చెప్పారు. బీఆర్ఎస్ - కాంగ్రెస్ పార్టీలు ఒక్కటేనని అన్నారు. బీజేపీ ఎమ్మెల్యేనే తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకార చేస్తారన్నారు. తెలంగాణ భవిష్యత్ కోసం మోదీ సర్కార్ రావాల్సిన అవసరముందన్నారు..