రూ.3 వేల అప్పు తీర్చలేదని... చిరు వ్యాపారిపై దారుణం

Byline :  Veerendra Prasad
Update: 2023-09-20 07:15 GMT

రూ. 3,100  అప్పు తీర్చలేదని చిరు వ్యాపారిపై తమ ప్రతాపం చూపించారు కొందరు వ్యక్తులు. గదిలో బంధించి, కర్రలతో చితకబాదారు. ఇది చాలదన్నట్లుగా.. ఆ వ్యాపారి బట్టలూడదీసి.. బూతులు తిడుతూ.. నగ్నంగా మార్కెట్ లో పరుగెత్తించారు. ఈ అమానవీయ ఘటన ఉత్తరప్రదేశ్‌ (uttar pradesh)లో చోటు చేసుకొంది. నోయిడా (Noida)కు చెందిన ఒక వ్యక్తి వెల్లులి వ్యాపారం (Garlic Vendor) చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే, వ్యాపారంలో పెట్టుబడి కోసం నెల రోజుల క్రితం మార్కెట్‌లో కమీషన్‌ ఏజెంట్‌ అయిన సుందర్‌ అనే వ్యక్తి నుంచి రూ.5,600లను అప్పుగా తీసుకున్నాడు. ఈ క్రమంలో ఏజెంట్‌ వచ్చి తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వాలని అడిగాడు. ఆ చిరు వ్యాపారి తన వద్ద ఉన్న రూ.2,500లను అతడికి ఇచ్చాడు. మిగిలిన డబ్బు చెల్లించేందుకు కాస్త సమయం కావాలని అడిగాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఏజెంట్‌ మరికొందరితో కలిసి ఆ వ్యాపారిపై విరుచుకుపడ్డాడు.

అతడిని గదిలో వేసి కర్రలతో చితకబాదారు. అంతటితో వారు ఊరుకోలేదు. బాధితుడి దుస్తులు తీసేసి మార్కెట్‌లో నగ్నంగా ఊరేగించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాని నెటిజన్లు డిమాండ్‌ చేస్తూ కామెంట్లు పోస్టు చేశారు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితుడు ఏజెంట్‌ సుందర్‌తో పాటు మరొకరిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మిగితా వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.




Tags:    

Similar News