తెలంగాణలో ముగిసిన నామినేషన్ల పర్వం..

Update: 2023-11-10 10:31 GMT

తెలంగాణ ఎన్నికల్లో కీలక ఘట్టానికి తెరపడింది. ఇవాళ్టితో ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసింది. మధ్యాహ్నం 3 గంటల్లోపు లైన్లో ఉన్నవారికి నామినేషన్‌ వేసే అవకాశం కల్పించారు. చివరి రోజు కావడంతో భారీ సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. కామారెడ్డి నుంచి రేవంత్ రెడ్డి, హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్, ఖమ్మం నుంచి మంత్రి పువ్వాడ సహా పలువురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. ఈ నెల 13న నామినేషన్ల పరిశీలన.. 15వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది.

119 నియోజకవర్గాల్లో 2500కు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. అత్యధికంగా గజ్వేల్, మేడ్చల్ నియోజకవర్గాల్లో నామినేషన్లు వేశారు. గజ్వేల్‌లో యాభై, మేడ్చల్‌లో ముప్పై వరకు నామినేషన్లు దాఖలైనట్లు తెలుస్తోంది. నామినేషన్ల ఘట్టం ముగియడంతో ప్రచారం ఊపందుకుంది. గులాబీ బాస్ వరుస సభలతో హోరెత్తిస్తుండగా.. కాంగ్రెస్, బీజేపీ ప్రచార వేగాన్ని పెంచనున్నాయి. కాగా ఈ నెల 30న పోలింగ్ జరగనుండగా.. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి.


Tags:    

Similar News