అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సజావుగా కొనసాగుతోంది. పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, హీరో సుమంత్, సంగీత దర్శకుడు కీరవాణి తదితరులు క్యూలైన్‌లో నిలుచుని ఓటు వేశారు.
ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి జూబ్లీహిల్స్‌లోని ఓబుల్‌రెడ్డి స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. తన సతీమణి లక్ష్మీ ప్రణతి, తల్లి షాలినితో కలిసి ఎన్టీఆర్ పోలింగ్ స్టేషన్కు వచ్చారు. ఇక అల్లు అర్జున్ బీఎస్‌ఎన్‌ఎల్ సెంటర్ పోలింగ్ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. హీరో సుమంత్ జూబ్లీహిల్స్ క్లబ్‌లో ఓటు వేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.