Removal of Flexis: ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల తొలగింపు

Byline :  Veerendra Prasad
Update: 2024-01-18 04:00 GMT

టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు, ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా.. గురువారం ఉదయమే ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నందమూరి వారసులు నివాళులర్పించారు. గురువారం వేకువజామునే ఆయన మనవళ్లు, సినీనటులు జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ అక్కడికి చేరుకుని అంజలి ఘటించారు. ఇక ఆ తర్వాత ఉదయం 7 గంటల సమయంలో ఎన్టీఆర్ తనయులు నందమూరి రామకృష్ణ, నందమూరి బాలకృష్ణ.. ఎన్టీఆర్ ఘాట్ కు చేరుకొని, సమాధి వద్ద పూలమాలల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.

ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా.. హుస్సేన్ సాగర్ తీరంలో ఉన్న ఎన్టీఆర్ ఘాట్ వద్ద కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు.. ఆయన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి ఉన్న ఫ్లెక్సీలను, పోస్టర్‌లను రోడ్డుకు ఇరువైపులా.. నివాళులర్పించేందుకు వస్తున్న టీడీపీ అభిమానులకు స్వాగతం తెలుపుతున్నట్లుగా ఉంచారు. అయితే కారణాలేంటో తెలియదుగానీ.. ఈ ఉదయం నందమూరి వారసులైన రామక‌ృష్ణ, బాలకృష్ణలు నివాళులర్పించి వెళ్లగానే.. అక్కడ జూ. ఎన్టీఆర్ ఫోటోలతో ఉన్న ఫ్లెక్సీలను తొలగిస్తున్నారు. ఇక అంతకుముందు ఘాట్ వద్ద బాలకృష్ణ మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ అంటే నవరసాలకు అలంకారమని, పేదల సంక్షేమానికి ఎన్టీఆర్‌ అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని గుర్తుచేసుకున్నారు.

Full View

Tags:    

Similar News