Numaish 2024: జనవరి 1 నుంచి నుమాయిష్..

By :  Kiran
Update: 2023-12-28 10:09 GMT

హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏటా నిర్వహించే నుమాయిష్ కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈసారి నిర్వహించే 83వ ఆలిండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. జనవరి 1న ప్రారంభం కానున్న నుమాయిష్.. 45 రోజుల పాటు కొనసాగనుంది. ఈసారి ఎగ్జిబిషన్ టికెట్ ధర రూ. 40గా నిర్ణయించారు.

నుమాయిష్కు వేలాది మంది వచ్చే అవకాశముండటంతో భద్రతాపరంగా ఎలాంటి లోపం తలెత్తకుండా పోలీస్ శాఖతో సమన్వయం చేసుకుంటూ ఎగ్జిబిషన్ సొసైటీ అన్ని చర్యలు తీసుకుంటోంది. సీసీ కెమెరాలతో పటిష్ఠ నిఘా ఏర్పాటుచేస్తోంది. తెలంగాణ, ఏపీలతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన ఉత్పత్తులను, ప్రభుత్వ స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు. ఈసారి ఎగ్జిబిషన్లో దాదాపు 2,400 స్టాల్స్ ఏర్పాటు కానున్నాయి.

నుమాయిష్లో ఒకే చోట అన్ని రకాల వస్తువులు అందుబాటులో ఉండనున్నాయి. అనేక రాష్ట్రాల ఉత్పత్తులు అందుబాటులో ఉండడంతో భారీగా జనాలు వచ్చే అవకాశముంది. ముఖ్యంగా దుస్తులు, వంట సామాగ్రి, దుప్పట్లు, బెడ్‌ షీట్లు, డ్రై ఫ్రూట్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఫర్నిచర్, ఇతర ఉపకరణాలు ఎగ్జిబిషన్లో దొరుకుతాయి. ఈ ఏడాది దాదాపు 22 లక్షల మంది నుమాయిష్ కు వస్తారని అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు.

నుమాయిష్కు వచ్చే సందర్శకులను గోషా మహల్, అజంతా గేట్, గాంధీ భవన్ గేట్ల వద్ద తనిఖీ చేసిన అనంతరం లోపలికి పంపిస్తారు. ప్రతి ఏడాదిలాగే ఈ సారి కూడా నిర్వాహకులు సందర్శకుల కోసం సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు.


Tags:    

Similar News