ధర్నా విరమించుకున్న యజమానులు.. ట్యాంకర్లు వచ్చేస్తున్నాయి

Byline :  Bharath
Update: 2024-01-02 11:16 GMT

తెలంగాణలో లారీ, ట్రక్ డ్రైవర్లు సమ్మెతో పెట్రోల్ పంపులకు ఇంధన సరఫరా నిలిచిపోయింది. మోటార్ వాహనాల చట్ట సంవరణను నిరసిస్తూ.. తెలంగాణలో పెట్రోల్, ఆయిల్ ట్యాంకర్ల ఓనర్లు ధర్నా చేపట్టారు. తాజాగా ఆ ధర్నాను ఓనర్లు విరమించుకున్నారు. దీంతో ట్యాంకర్లు యథావిధిగా నడుస్తున్నాయి. మంగళవారం (జనవరి 2) ఉదయం నుంచి ఆయిల్ ట్యాంకర్ల ఓనర్లు ధర్నాకు దిగడంతో పెట్రోల్ బంకుల దగ్గర ఎంట్రీ క్లోజ్ అంటూ నో స్టాక్ బోర్డులు పెట్టారు. దీంతో వాహనదారులు బంకుల వద్ద ఉదయం నుంచి క్యూ కట్టారు.

నిన్న ఉదయం నుంచి ధర్నా చేసిన యజమానులు

కేంద్రం మోటారు వాహనాల చట్టం సవరణను నిరసిస్తూ నిన్న ఉదయం నుంచి ధర్నా చేస్తున్నార. చర్లపల్లిలోని ఆయిల్‌ కంపెనీల వద్దకు భారీగా చేరుకుని ధర్నాకు దిగారు. ఈ క్రమంలో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ధర్నా విరమింపజేశారు. దీంతో పెట్రోల్, డీజిల్ ట్యాంకులు యథావిధిగా నడుస్తున్నాయి.

Tags:    

Similar News