తెలంగాణలో ఐపీఎల్ అధికారుల బదిలీ మరోసారి జరిగింది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో అధికారుల బదిలీల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు అధికారులను ప్రభుత్వం బదిలీ చేయగా.. తాజాగా మరో నలుగురు ఐపీఎస్ అధికారులను ట్రాన్స్‌ఫర్ చేసింది. మహబూబాబాద్ ఎస్పీ పాటిల్ సంగ్రామ్ సింగ్ గణపతిరావు బదిలీ చేసిన ప్రభుత్వం.. డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఆయన స్థానంలో మహబూబాబాద్ ఎస్పీగా కే. సుధీర్ రామ్‌నాథ్‌ను నియమించింది. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
బదిలీ అయిన అధికారులు:
• హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీగా అకాంక్ష్ యాదవ్
• మంచిర్యాల డీసీపీగా అశోక్ కుమార్
• మహబూబాబాద్ ఎస్పీగా కే. సుధీర్ రామ్‌నాథ్
• మహబూబాబాద్ ఎస్పీ పాటిల్ సంగ్రామ్ సింగ్ గణపతిరావు (డీఎస్పీ ఆఫీస్ లో రిపోర్ట్)