ప్రధాని మోదీ రాకతో వరంగల్ నగరం కాషాయ మయం అయింది. తోరణాలు, ఫ్లేక్సీలు, హార్డింగ్స్ తో రహదారులన్నీ ముస్తాబయ్యాయి. దాదాపు 30 ఏళ్ల తర్వాత మోదీ వరంగల్ కు వస్తుండటంతో.. ప్రజల్లో ఆసక్తి నెలకొంది. ఆర్ట్స్ కాలేజీలో జరిగే మోదీ సభకు పెద్ద ఎత్తును కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. అయితే ఆర్ట్స్ కాలేజీలో ఏర్పాటు చేసిన సభా వేదికపై ప్రధాని సహా.. మరో ఎనిమిది మంది నేతలకే అవకాశం ఉంటుందని పీఎంఓ కార్యాలయ డిప్యూటీ సెక్రెటరీ కేఆర్ రాయ్ టూర్ షెడ్యూల్ లో స్పషం చేశారు.
షెడ్యూల్ లో భాగంగా మోదీతో పాటు.. గవర్నర్ తమిళసై, సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ బండి సంజయ్, పసునూరి దయాకర్ లకు అనుమతి ఉంది. మోదీ పర్యటనను బహిష్కరిస్తున్నామని, తమ నాయకులెవరూ సభలో పాల్గొనబోరని బీఆర్‌ఎస్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో.. సీఎం కేసీఆర్, మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ దయాకర్ పాల్గొనే అవకాశం లేదు. దీంతో ఆ సీట్లు ఖాళీగా ఉండే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి.