బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను లైగికంగా వేధించాడని.. ఆరిజిన్ డైరీ సీఏఓ శైజల్ ఆరోపిస్తూ.. ఢిల్లీలోని తెలంగాణ భవన్ దగ్గర ఆత్మమత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన ఫిర్యాదుపై మహిళా కమిషన్ స్పందించి.. ఎమ్మెల్యేపై వస్తున్న ఆరోపణలపై విచారణ జరపాలని తెలంగాణ డీజీపీకి లేఖ రాసింది. తాజాగా శేజల్ ఎమ్మెల్యే చిన్నయ్యపై సీబీఐకి ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని సీబీఐని కోరింది.