త్వరలో ఓయూ రోడ్డు క్లోజ్.. వాహనాలకు నో పర్మిషన్.. ఎందుకంటే..?

Update: 2023-08-14 09:12 GMT

ఉస్మానియా యూనివర్సిటీ.. తెలంగాణలో ఈ పేరు తెలియని వారుండరు. వందేళ్లకుపైగా చరిత్ర కలిగిన ఈ యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమంలోనూ కీలక పాత్ర పోషించింది. ఇక నగరవాసులకు ఈ క్యాంపస్తో ప్రత్యేక అనుబంధం ఉంది. అయితే ఇన్నాళ్లు అందబాటులో ఉన్న ఓయూలోని లింక్ రోడ్డు త్వరలోనే మూతపడనుంది. త్వరలోనే దీనికి ప్రత్యామ్నాయ రోడ్డును నిర్మించనున్నారు.

తార్నాక నుంచి అంబర్‌పేట్, అడిక్‌మెట్‌, ఫీవర్ హాస్పిటల్‌ను కలుపుతూ క్యాంపస్‌ మధ్యలోంచి ఉన్న లింక్ రోడ్డు మరికొన్ని రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ మార్గంలో వాహనాల రాకపోకలు స్టూడెంట్స్‌కు ఇబ్బందికరంగా మారిందనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో అతిత్వరలోనే ప్రత్యామ్నాయ రోడ్డు నిర్మిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. 144 కోట్లతో ఓయూను అభివృద్ధి చేస్తామన్నారు.

క్యాంపస్‌ మధ్యలో ఉన్న రోడ్డుకు బదులుగా నూతన లింక్‌ రోడ్డు పనులను త్వరలో ప్రారంభిస్తామని కేటీఆర్ చెప్పారు. ఏడాదిలోగా ఈ రోడ్డు పనులను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఇది పూర్తైతే ఓయూలోని లింక్ రోడ్డుపై వాహనాలకు అనుమతి ఉండదు. దీంతో హైదరాబాద్ యూనివర్సిటీ తర్వాత క్లోజ్డ్ యూనివర్సిటీ ఓయూ నిలవనుంది. ప్రస్తుతం ఈ రోడ్డుపై ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8గంటల వరకు వాహనాల రాకపోకలు సాగుతున్నాయి.

Tags:    

Similar News