Etala Rajender : ఆయన మీద కోపంతోనే..కాంగ్రెస్కు ఓటేశారు...ఈటల రాజేందర్
Byline : Vinitha
Update: 2024-02-26 06:52 GMT
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై కోపంతోనే ప్రజలు కాంగ్రెస్కు ఓటేశారన్నారు బీజేపీ నేత ఈటల రాజేందర్. కానీ లోక్ సభ ఎన్నికల్లో అలా ఉండదని..ప్రజలంతా బీజేపీకే ఓటేస్తామని ముక్త కంఠంతో చెబుతున్నారని తెలిపారు. ఈ మేరకు గజ్వేల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
మహిళల ఆత్మగౌరవం నిలబెట్టిన ఘనత కేంద్ర ప్రభుత్వానిదేనని కొనియాడారు. 10 లక్షల మంది మహిళలకు వడ్డీలేని రుణాలు ఇస్తున్నామని తెలిపారు. మహిళలు, యువత అంతా కలిసి మోదీని మరోసారి అధికారంలోకి తీసుకురావాలని అనుకుంటున్నారని చెప్పారు. గతంలో కాంగ్రెస్ పాలనలో ఎక్కడ చూసినా కుంభకోణాలే జరిగాయని ఆరోపించారు. మోదీ నాయకత్వంలో ఎలాంటి మచ్చ లేకుండా బీజేపీ ప్రభుత్వం కొనసాగుతోందని ఈటల రాజేందర్ అన్నారు.