అతితక్కువ కాలంలోనే అద్భుతమైన అభివృద్ధి : కేసీఆర్

Update: 2023-08-23 12:03 GMT

అతితక్కవ కాలంలోనే తెలంగాణ అన్ని రంగాల్లో పురోగతి సాధించిందని సీఎం కేసీఆర్ అన్నారు. మెదక్ ఎస్పీ ఆఫీసు, కలెక్టరేట్ను ఆయన ప్రారంభించారు. కేవలం తొమ్మిదిన్నర ఏళ్లలోనే ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకునే స్థాయికి తెలంగాణ ఎదిగిందన్నారు. కొన్ని రాష్ట్రాల్లో సరైన అసెంబ్లీ, సెక్రెటేరియట్‌ కూడా లేవన్నారు. తలసారి ఆదాయంలో 60, 70 ఏళ్ల క్రితం ఏర్పాటైన రాష్ట్రాలను అధిగమించి రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందన్నారు.

ఇంటింటికి స్వచ్చమైన తాగునీరు అందించే ఏకైక రాష్ట్రం తెలంగాణే అని కేసీఆర్ చెప్పారు. విద్యుత్ వినియోగంలోనూ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. అన్ని జిల్లాల్లో నిర్మించుకున్న ఈ పరిపాలనా భవనాలు చూస్తేనే మన రాష్ట్ర అభివృద్ధి గురించి తెలిసిపోతుందన్నారు. గతంలో చేతగాని పాలకుల వల్ల రాష్ట్రం వెనుకబడి పోయిందన్నారు. రాష్ట్రంలో ఇంత అభివద్ధి జరుగుతున్న విపక్షాలు విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. గతంలో 200 ఉన్న పింఛన్ను 4వేలకు పెంచామన్నారు.

తెలంగాణ రాకముందు 24 లక్షల పింఛన్లు మాత్రమే ఉంటే.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాదాపు 50లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నట్లు కేసీఆర్ వివరించారు. రాష్ట్ర సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. అనంతరం దివ్యాంగులకు పెంచిన పెన్షన్ చెక్కులను అందజేశారు. కాగా అంతకుముందుకు కేసీఆర్ బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు. పార్టీ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్ రెడ్డికి పుష్పగుచ్చం ఇచ్చి అభినందించారు.

Tags:    

Similar News