MLC Kavitha : కల్వకుంట్ల కవితకు ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ అరుదైన గౌరవం...

Update: 2023-10-24 09:32 GMT

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీ నుంచి ఆహ్వానం అందింది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి అంశంపై కీలకోపన్యాసం ఇవ్వాలని వర్సిటీ యాజమాన్యం ఆమెను కోరంది. కవిత ఇటీవల బ్రిడ్జ్ ఇండియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగించడానిక లండన్ వెళ్లినప్పుడు ఆక్స్‌ఫర్డ్ విద్యార్థులను కలుసుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో పదేళ్లుగా సాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ముచ్చటించారు. ఈ నేపథ్యంలో మరిన్ని వివరాలతో తెలంగాణపై మాట్లాడాలని యూనివర్సిటీ ఆధికారులు ఆమెకు ఆహ్వానం పంపారు. తెలంగాణ వ్యవవసాయం రంగ అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఆమె మాట్లాడతారు.

భారత రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం అనే అంశంపై బ్రిడ్జ్ ఇండియా నిర్వహించిన సదస్సులో కవిత మాట్లాడారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లు ఆమోదం కోసం కవిత ఎంతగానో పోరాడారని బ్రిడ్జ్ సంస్థ తెలిపింది. ‘‘బిల్లు కోసం ఢిల్లీలోని 6000 మందితో ఆమె ధర్నా నిర్వహించారు. 18 పార్టీల నేతలు హాజరై మద్దతు ప్రకటించారు. బిల్లుపై ఢిల్లీలో భారత్ జాగృతి నిర్వహించిన సమావేశంలో 13 పార్టీలు సహా మహిళా, విద్యార్థి, రైతు సంఘాల నేతలు పాల్గొన్నారు. ఇలా పలు పోరాటాలతో ఆమె బిల్లకు మద్దతు కూడగట్టారు. దేశవ్యాప్తంగా చర్చనీయాంశం చేశారు’’ అని కొనియాడింది.


Tags:    

Similar News