Dharmapuri Arvind: నిజామాబాద్ ఎంపీగా అరవింద్ వద్దు అంటూ కరపత్రాల కలకలం

Byline :  Veerendra Prasad
Update: 2024-02-19 05:23 GMT

జగిత్యాల జిల్లాలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌కు వ్యతిరేకంగా పంపిణీ చేసిన కరపత్రాలు సంచలనంగా మారాయి. గత కొద్ది రోజులుగా నిజామాబాద్‌తో పాటు జగిత్యాల, కోరుట్లలో ఎంపీ అరవింద్ పై సొంత పార్టీలోని కొందరు సీనియర్ లీడర్లు తిరుగుబాటు చేస్తున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వకూడదని ఆందోళనలు సైతం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం కోరుట్లలో, మెట్టుపల్లిలో న్యూస్ పేపర్లలో వచ్చిన కరపత్రాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి."కండ్లకు ఉన్న కూలింగ్ అద్దాలు తీయడు.. కారు దిగి ప్రజలతో మాట్లాడడు ఇంత అహంకారి నియంత ధర్మపురి అరవింద్ నిజామాబాద్ ఎంపీగా వద్దు" అని ప్రింట్ చేసి ఉన్న కరపత్రాలపై ఈ. కృష్ణమాచారి, పి.గంగాధర్, కే. శ్రీనివాస్, బి. రమేష్ అని పేర్లు రాసి ఉన్నాయి.

ఈ కరపత్రాలపై ప్రింటర్ పేరు, నేతల హోదాలు లేవు. దీంతో పలు అనుమానాలకు తావిస్తుంది. ఎంపీ అరవింద్ కు వ్యతిరేకంగా వేరే పార్టీ వారు కరపత్రాలను పంపిణీ చేశారా?.. లేదంటే, బీజేపీ నేతలే ఆయనపై అసహనంతో పంపిణీ చేయించారా ? అన్నది సస్పెన్స్ గా మారింది. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Tags:    

Similar News