పంజాగుట్ట యాక్సిడెంట్ కేసులో కీలక మలుపు

Update: 2024-02-05 05:43 GMT

పంజాగుట్ట యాక్సిడెంట్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. తాజాగా మాజీ సీఐ దుర్గరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సహకరించారని దుర్గారావుపై ఇప్పటికే కేసు నమోదు చేశారు. డిసెంబర్ 23, 2022 రాత్రి ప్రజా భవన్‌ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. విచారణ అనంతరం దుర్గారావును సస్పెండ్ చేశారు. నిజామాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రేమ్‌కుమార్‌, షకీల్‌ అనుచరుడు అబ్దుల్‌వాహేలను అరెస్టు చేశారు. అనంతరం వారిని వెస్ట్ జోన్ డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ (డిసిపి) ఎస్‌ఎం విజయ్ కుమార్ విచారించారు.

సంఘటనకు సంబంధించిన వివరాలు, పాల్గొన్న వ్యక్తుల గురించి విచారించారు. వీరి ప్రమేయం ఏ మేరకు ఉందో తెలుసుకోవడానికి కాల్ డేటాపై విచారణలో దృష్టి సారించారు. సాహిల్​ స్థానంలో తన కారు డ్రైవర్​ను పంపించాడు. దీంతో ఇన్​స్పెక్టర్​ దుర్గారావు సాయంతో షకీల్ అనుచరులు సాహిల్​ను దుబాయ్​ పారిపోయేందుకు సహకరించారు. అయితే రోడ్డు ప్రమాదం జరిగిన రోజు బోధన్ సీఐ ప్రేమ్​కుమార్ పంజాగుట్ట సీఐ ఫోన్​లో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో పాటు దుబాయ్ పారిపోయేందుకు అబ్దుల్ వాసే సహకరించినట్లు తేల్చారు. అనంతరం సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా నిందితుడు, సీఐల ఇద్దరి కాల్ రికార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని పోలీసులు దర్యాప్తు చేసి ప్రేమ్ కుమార్​ను అరెస్టు చేశారు. కాగా ఇప్పటి వరకూ ఈ కేసులో షకీల్ డ్రైవర్ సహా అతనికి సహకరించిన మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Tags:    

Similar News