TS Elections: స్వల్ప తేడాతో ఓడిన స్థానాలపై గురి.. అవి ఏంటంటే?
అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది పార్టీలన్నీ ప్రచారాలు ముమ్మరం చేశాయి. గెలుపు లక్ష్యంగా ముందుకు కదులుతున్నాయి. అభ్యర్థులను సిద్ధం చేస్తూ.. నియోజక వర్గాల్లో పర్యటిస్తున్నాయి. హామీలు ప్రకటిస్తూ ఓటర్లను ఆకర్శించే పనిలో పడ్డాయి. ఈ క్రమంలో గత ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో ఓడిపోయిన నియోజకవర్గాలపై దృష్టిపెట్టాయి. ఆ నియోజక వర్గాల్లో తమ పార్టీ గ్రాఫ్ ను పరీక్షిస్తూ.. వ్యూహాలు రచిస్తున్నాయి. ఇటీవలే రెండు ప్రధాన పార్టీలు కొన్ని నియోజక వర్గాలపై సర్వే చేసినట్లు తెలుస్తుంది. ఆ సర్వే ప్రకారం 7 స్థానాల్లో బీఆర్ఎస్, 4 చోట్ల కాంగ్రెస్, 3 స్థానాల్లో బీజేపీ, ఒకచోట బీఎస్పీ పార్టీలు స్వల్ప తేడాతో ఓడిపోయాయి. ఆ కొద్ది ఓట్ల తేడా దేనివల్ల వచ్చింది. దానికి గల కారణాలు కనుక్కుని... వాటిని చక్కబెట్టే పనిలో పడ్డాయి పార్టీలు. దీనికోసం గ్రామ నాయకులు, మహిళా సంఘాల వారితో సమావేశాలు నిర్వహించి.. వారికి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.
స్వల్ప మెజారిటో తేడా వచ్చిన నియోజకవర్గాలు:
• ఆసిఫాబాద్- 171 ఆధిక్యంతో కాంగ్రెస్ గెలుపు- ప్రత్యర్థి బీఆర్ఎస్
• ఇబ్రహీంపట్నం- 376 ఆధిక్యంతో బీఆర్ఎస్ గెలుపు- ప్రత్యర్థి బీఎస్పీ
• ధర్మపురి - 441 ఆధిక్యంతో బీఆర్ఎస్ గెలుపు- ప్రత్యర్థి కాంగ్రెస్
• కోదాడ - 758 ఆధిక్యంతో బీఆర్ఎస్ గెలుపు- ప్రత్యర్థి కాంగ్రెస్
• అంబర్ పేట్- 1016 ఆధిక్యంతో బీఆర్ఎస్ గెలుపు- ప్రత్యర్థి బీజేపీ
•తుంగతుర్తి- 1847 ఆధిక్యంతో బీఆర్ఎస్ గెలుపు- ప్రత్యర్థి కాంగ్రెస్
•వైరా- 2013 171 ఆధిక్యంతో స్వతంత్ర అభ్యర్థి గెలుపు- ప్రత్యర్థి బీఆర్ఎస్
• సంగారెడ్డి- 2589 ఆధిక్యంతో కాంగ్రెస్ గెలుపు- ప్రత్యర్థి బీఆర్ఎస్
• మల్కాజిగిరి - 2680 ఆధిక్యంతో బీఆర్ఎస్ గెలుపు- ప్రత్యర్థి బీజేపీ
• తాండూరు - 2875 ఆధిక్యంతో కాంగ్రెస్ గెలుపు- ప్రత్యర్థి బీఆర్ఎస్
• ఇల్లెందు - 2887 ఆధిక్యంతో కాంగ్రెస్ గెలుపు- ప్రత్యర్థి బీఆర్ఎస్
• వికారాబాద్- 3092 ఆధిక్యంతో బీఆర్ఎస్ గెలుపు- ప్రత్యర్థి కాంగ్రెస్
• కల్వకుర్తి - 3447 ఆధిక్యంతో బీఆర్ఎస్ గెలుపు- ప్రత్యర్థి బీజేపీ
• మధిర- 3567 ఆధిక్యంతో కాంగ్రెస్ గెలుపు- ప్రత్యర్థి బీఆర్ఎస్
• కొత్తగూడెం- 4139 ఆధిక్యంతో కాంగ్రెస్ గెలుపు- ప్రత్యర్థి బీఆర్ఎస్