Gaddar Demise :గద్దర్ మృతికి సంతాపం తెలియజేస్తూ మావోయిస్ట్ పార్టీ లేఖ
ప్రజా యుద్ధనౌక గద్దర్ మృతికి సంతాపం తెలుపుతూ మావోయిస్ట్ పార్టీ లేఖను విడుదల చేసింది. ఆయన మరణం అందరికీ ఆవేదన కల్గించిందనీ తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు కమిటీ లేఖలో తెలిపింది. గద్దర్ అంటే తెలియని వారు ఉండరు, ఆయన మరణం మమ్మల్ని తీవ్రంగా కలిచివేసింది. ఆయనకు మా ప్రగాఢ ంతాపాన్ని తెలిజేస్తున్నాము అలాగే కుటుంబ సభ్యలుకు సానుభూతి కూడా తెలియజేస్తున్నాము.
1972 నుంచి 2012 వరకు మావోయిస్టు పార్టీ సభ్యుడిగా గద్దర్ పనిచేశారు. పాటలు, నాటికలు, బుర్ర కథలు, ఒగ్గు కథల ద్వారా పీడిత ప్రజలను ఆయన చైతన్య పరిచారు. బూటకపు ఎన్ కౌంటర్లలో మరణించిన విప్లకారుల శవాలను తమ కుటుంబాలకు చేరనీయప్పుడు శవాల స్వాధీన ఉద్యమానికి గద్దర్ నాయకత్వం వహించారని మావోయిస్ట్ లేఖ లో రాశారు.
1997లో నల్లదండు ముఠా, పోలీసులు కలిసి గద్దర్ మీద కాల్పులు చేశారు. ఐదు తూటాలు శరీరంలోకి దూసుకెళ్ళినా ప్రాణాలతో బయటపడ్డారు. చివరికాలంలో పార్టీ నిబంధనలకు విరుద్ధంగా పాలక పార్టీలతో కలవడంతో మా పార్టీ షోకాజ్ నోటీస్ ఇచ్చింది. దీంతో 2012లో పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దాన్ని మా పార్టీ ఆమోదించింది. 2012 వరకు పీడిత ప్రజాపక్సాన నిలిచిన గద్దర్ ఆ తరువాత బూర్జువా పార్లమెంటు మార్గాన్ని ఎంచుకున్నారని మావోయిస్ట్ పార్టీ లేఖలో పేర్కొంది.