రైలు ప్రయాణికులకు అలర్ట్..వారం పాటు ఈ 28 రైళ్లు రద్దు

Update: 2023-06-20 03:44 GMT

ఒడిశా రైలు ప్రమాదం అనంతరం అప్రమత్తమైన రైల్వే శాఖ వివిధ స్టేషన్లలో ట్రాకుల నిర్వహణ పనులు చేపడుతోంది. ఈ క్రమంలో సికింద్రాబాద్‌ డివిజన్ల పరిధిలో ట్రాక్ నిర్వహణ పనుల కారణంగా ఇవాళ్టి నుంచి 28 రైళ్ల రాకపోకలను నిలిపివేసింది. జూన్ 25 వరకు మరో ఆరు రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే శాఖ తాజాగా ప్రకటించింది. గుంతకల్-బోధన్ రైలు సమయంలోనూ మార్పులు చేసింది. వీటితో పాటే 23 ఎంఎంటీఎస్ రైళ్లను కూడా వారం పాటు రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో ఏపీ, తెలంగాణకు చెందిన రైలు ప్రయాణికులు రద్దైన రైళ్ల వివరాలను తెలుసుకుని ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. రద్దయిన వాటిలో కాజీపేట-డోర్నకల్‌-కాజీపేట, డోర్నకల్‌-విజయవాడ-డోర్నకల్‌, భద్రాచలంరోడ్‌-విజయవాడ-భద్రాచలంరోడ్‌, సికింద్రాబాద్‌-వికారాబాద్‌-సికింద్రాబాద్‌, సికింద్రాబాద్‌-వరంగల్‌-సికింద్రాబాద్‌, కరీంనగర్‌-నిజామాబాద్‌-కరీంనగర్‌, కాచిగూడ-నడికుడి-కాచిగూడ వంటి రైళ్లు ఉన్నాయి

Tags:    

Similar News