రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జోరు పెంచింది. కర్నాటక ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్ తో రాష్ట్రం నాయకుల్లో హుశారు పెరిగింది. బటర్ ఫ్లై ఎఫెక్ట్ లాగ, కర్నాటకలో కాంగ్రెస్ గెలుపు.. తెలంగాణ కాంగ్రెస్ కు బలం తెచ్చిపెట్టింది. ఈ క్రమంలో పార్టీలోకి పెద్ద మొత్తంలో చేరికలు జరుగుతాయని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్షం, రూలింగ్ పార్టీ నుంచి భారీ చేరికలు జరుగబోతున్నాయి. బడా నాయకులంతా.. కాంగ్రెస్ గడప తొక్కే ప్రయత్నం చేస్తున్నారు.
ఇన్నిరోజుల నుంచి పార్టీలో సీనియర్ లీడర్ల మధ్య గొడవలు, మనస్పర్దలు జరిగిన విషయం తెలిసిందే. అయితే, మల్లిఖార్జున్ ఖర్గే ఇంచార్జ్ అయిన తర్వాత.. అవికాస్త సర్దుమనిగాయి. సీనియర్ నాయకులంతా.. పాదాయాత్రలు, ర్యాలీలు నిర్వహిస్తూ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ బలం పెంచుకునేందుకు పక్క పార్టీ లీడర్లతో చర్చలు జరిపి కాంగ్రెస్ లోకి లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో చాలామంది లీడర్లు కూడా కాంగ్రెస్ లో జాయిన్ అయ్యేందుకు రెడీగా ఉన్నారు. జూపల్లి కృష్ణారావు వంటి లీడర్లు కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్దంగా ఉన్నారని ఇప్పటికే వార్తుల వచ్చాయి.
పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్ గూటికి:
పట్నం మహేందర్ రెడ్డి కూడా కాంగ్సెస్ గూటికి చేరే అవకాశం ఉంది. ఎలా చూసినా పట్నం మహేందర్ కు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే అవకాశం కనిపించట్లేదు. అంతేకాకుండా తనకు ఎమ్మెల్సీగా ఉండటం ఇష్టం లేదట. అంతేకాకుండా ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో పైలట్ రోహిత్ రెడ్డిని పట్టించడంలో సాయం చేసినట్లు వార్తలు వచ్చాయి. అంతేకాకుండా ఈసారి కూడా తాండూరు ఎమ్మెల్యే టికెట్ పైలట్ కే ఇస్తున్నట్లు తెలుస్తోంది. దాంతో పట్నం మహేందర్ బీఆర్ఎస్ ను వీడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ.. పట్నం మహేందర్ కు ఎమ్మెల్యే టికెట్ ఇస్తామన్న హామీలిచ్చి ఆహ్వానించింది.