జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు బ్రేక్‌కు పడింది. పవన్ కల్యాణ్ స్వల్ప అనారోగ్యానికి గురికావడంతో వారాహి యాత్రను రెండు రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు పార్టీ వర్గాలు ప్రకటించాయి. ప్రస్తుతం పవన్ వారాహి యాత్ర ఉభయ గోదావరి జిల్లాలో కొనసాగుతోంది. ఎక్కడికి వెళ్లినా అభిమానులు తండోపతండాలుగా వస్తున్నారు. వారాహి యాత్రకు మంచి స్పందన రావడంతో జనశేన శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. ఇంతలోనే పవన్ ఆరోగ్యం బాలేదని తెలియడంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు.
ప్రస్తుతం ఉపవాస దీక్షలో ఉన్న పవన్.. వరుస కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈక్రమంలోనే ఆయన మంగళవారం ఉదయం ఆయన అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వైద్యులు పవన్ కు వైద్య పరీక్షలు నిర్వహించి...రెండు రోజలు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. వైద్యుల సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు జనసేన పార్టీ వర్గాలు వెల్లడించాయి. బుధవారం, గురువారం తరువాత తిరిగి శుక్రవారం వారాహి యాత్ర ప్రారంభం కానుంది.