పవన్ కళ్యాణ్ పోటీ చేసేది అక్కడి నుంచే

Byline :  Vamshi
Update: 2024-03-14 09:59 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడినుంచి పోటీ అనే ఉత్కంఠకు తెరపడింది. తాను పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నట్లు జనసేని స్వయంగా ప్రకటించారు. గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక స్థానాల నుంచి ఆయన పోటీ చేశారు. ప్రస్తుతానికి ఎంపీగా పోటీ చేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు.దీనిపై కూటమి పెద్దలతో మాట్లాడిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటానని పవన్ తెలిపారు.

ఈ మేరకు మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేన ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా ఆయన శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. కాగా, వైసీపీ అభ్యర్థిగా ఎవరినీ ప్రకటించలేదు. అయితే, వంగా గీత, ముద్రగడ పద్మనాభం పేరును వైసీపీ అధిష్టానం పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ పవన్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే దానిపై స్పష్టత లేకపోవడంతో వైసీపీ నిర్ణయం వెలువరించలేదు. ఆయన కాకినాడ ఎంపీగా పోటీ చేస్తారని ఊహాగానాలు వినిపించాయి.

Tags:    

Similar News