Telangana Assembly Election 2023: తెలంగాణ ఎన్నికల బరిలో జనసేన.. రెండ్రోజుల్లో పవన్ కీలక ప్రకటన..

By :  Krishna
Update: 2023-10-18 06:40 GMT

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన బరిలో ఉంటుందా లేదా అన్నదానిపై మరో రెండు రోజుల్లో క్లారిటీ రానుంది. హైదరాబాద్‌లోని జనసేన కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తలతో పవన్ కల్యాణ్‌ భేటీ అయ్యారు. ఎన్నికల్లో పోటీ చేయాలని తెలంగాణ నేతలు పవన్ కు సూచించారు. కొత్త రాష్ట్రంలో రాజకీయ గందరగోళానికి తావివ్వరాదని గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నామని.. మిత్రపక్షమైన బీజేపీ విజ్ఞప్తితో జీహెచ్ఎంసీ ఎన్నికలకు సైతం దూరంగా ఉన్నామని నేతలకు పవన్ కు వివరించారు. ఈ సారి కూడా ఎన్నికల్లో పోటీ చేయకుంటే క్యాడర్ బలహీనపడే అవకాశం ఉందని పవన్ తో చెప్పారు.

ఎన్నికల్లో పోటీపై తనపై ఒత్తిడి ఉన్న మాట వాస్తవమేనని.. అయితే పార్టీ శ్రేణుల అభిప్రాయాలకు విలువ ఇస్తానని పవన్ స్పష్టం చేశారు. ఈ అంశంపై రెండు రోజుల్లో సరైన నిర్ణయం తీసుకుంటామని పవన్ తెలిపారు. అయితే పరిస్థితులు ప్రతికూలంగా మారే ప్రమాదం ఉన్నందున సానుకూల నిర్ణయం తీసుకోవాలని పవన్ కు జనసేన నాయకులు విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News