Janasena List : అభ్యర్థుల లిస్ట్ ప్రకటించిన జనసేన.. పోటీ ఎక్కడెక్కడంటే..

Byline :  Kiran
Update: 2023-10-02 12:40 GMT

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండు 2 నెలల సమయం మాత్రమే ఉండటంతో రాజకీయ పార్టీలన్నీ జోరు పెంచాయి. అధికార బీఆర్ఎస్ ఇప్పటికే 115 స్థానాల్లో అభ్యర్థుల్ని ప్రకటించగా.. తాజాగా జనసేన సైతం తాము పోటీ చేసే స్థానాలను ప్రకటించింది. రాష్ట్రంలో 32 చోట్ల తమ అభ్యర్థుల్ని బరిలో నిలుపుతామని జనసేన పార్టీ స్పష్టం చేసింది. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడమే పార్టీ లక్ష్యమని జనసేన తెలంగాణ శాఖ ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఎన్నికల్లో పోటీకి పూర్తి సన్నద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. చివరి క్షణంలో పొత్తులేమైనా ఉంటే ప్రస్తుతం ప్రకటించిన స్థానాల్లో మార్పులు ఉండొచ్చని చెప్పారు.

జనసేన పోటీ చేసే స్థానాలు..

కూకట్‌పల్లి

ఎల్బీనగర్‌

నాగర్‌కర్నూల్‌

వైరా

ఖమ్మం

మునుగోడు

కుత్బుల్లాపూర్‌

శేరిలింగంపల్లి

పటాన్‌చెరు

సనత్‌నగర్‌

కొత్తగూడెం

ఉప్పల్‌

అశ్వారావుపేట

పాలకుర్తి

నర్సంపేట

స్టేషన్‌ఘన్‌పూర్‌

హుస్నాబాద్‌

రామగుండం

జగిత్యాల

నకిరేకల్‌

హుజూర్‌నగర్‌

మంథని

కోదాడ

సత్తుపల్లి

వరంగల్‌ వెస్ట్‌

వరంగల్‌ ఈస్ట్‌

మల్కాజ్గిరి

ఖానాపూర్‌

మేడ్చల్‌

పాలేరు

ఇల్లందు

మధిర




 


యువత, మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతోనే పవన్‌ కల్యాణ్‌ జనసేనను స్థాపించారని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు మహేందర్‌ రెడ్డి చెప్పారు. ఇందులో భాగంగా ఇప్పటికే నాయకత్వాన్ని తయారు చేశామని అన్నారు. 25 సీట్లలో పార్టీకి బలమైన ఓటు బ్యాంకు ఉందన్న ఆయన.. గెలుపోటములు నిర్ణయించే స్థాయిలో తమ ఓటింగ్‌ ఉందని చెప్పారు. గత పదేళ్లలో అనేక సమస్యలపై తెలంగాణ జనసేన పోరాటం చేసిందని మహేందర్ రెడ్డి అన్నారు. నల్లమల యురేనియం తవ్వకాలు, మహిళలపై దాడులు, డ్రగ్స్‌ , ఆర్టీసీ కార్మికుల సమస్య, బీసీ, ఎస్టీ వర్గాలతో పాటు విద్యార్థుల సమస్యలపై పోరాటం చేశామని గుర్తు చేశారు.




Tags:    

Similar News