భయం గుప్పిట్లో అల్విన్ కాలనీ ప్రజలు..ఇళ్లను కమ్మేసిన కాలుష్యపు నురుగు

Byline :  Aruna
Update: 2023-09-05 11:57 GMT

గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ నగరం అతలాకుతలం అవుతోంది. కూటక్‎పల్లిలోని అల్విన్ కాలనీ చెరువు పొంగి కెమికల్స్ కలిసిన నురుగు గాల్లోకి ఎగురుతూ అక్కడి ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తోంది. నురుగు ఎగిరి కల్లల్లో పడితే ప్రమాదయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అల్విన్ కాలనీలోని ఇళ్ల చుట్టూ నురుగు కమ్మేసింది. అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి ప్రస్తుతం అల్విన్ కాలనీలో కనిపిస్తోంది. వర్షం పడిన ప్రతిసారి ఇలాగే చెరువు నురుగు కక్కుతుంది.

ధరణి నగర్ కాలనీలో పరిస్థితి మరింత ప్రమాదకరంగా కనిపిస్తోంది. ఇళ్లను మేఘాలు కమ్మేశాయా అన్నట్లు నురుగు ఇళ్లను చుట్టుముట్టింది. గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ధరణి నగర్ కాలనీలోకి భారీగా వరద నీరు చేరింది. ఈ వరద నీటితోనూ నురుగు పొంగిపొర్లుతోంది. జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియా నుంచి ఈ కెమికల్ వ్యర్థాలు వచ్చినట్లు తెలుస్తోంది. వరద నీటిలో కలిసిపోవడంతో ఆ నురుగు గాల్లోకి ఎగసిపడుతోంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాదు నురుగుతో పాటు భయంకరమైన వాసన వస్తుండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

Tags:    

Similar News