Tomatoes Free: ఫొటోలు దిగితే టమాటాలు ఫ్రీ.. లిమిటెడ్ ఆఫర్

Update: 2023-08-03 04:43 GMT

ప్రస్తుతం దేశంలో టమాటా ధరలు ఎలా ఉన్నాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పటికే కొన్ని చోట్ల కేజీ టమాట డబుల్ సెంచరీని దాటి ఇంకా పైపైకి వెళ్తోంది. అతి త్వరలో రూ.300 కు కూడా చేరొచ్చు. దీంతో టమాటా కొనాలంటే సామాన్యులు బెంబేలెత్తి పోతున్నారు. మరికొన్ని చోట్ల కనీవినని రీతిలో ఏకంగా టమాటా చోరీలకు పాల్పడుతున్నారు. విలువైన వస్తువుల జాబితాలో ప్రస్తుతం టమాట కూడా చేరిపోయింది.

టమాటా ప్యాకెట్ ఫ్రీ




 


అయితే తాజాగా రాష్ట్రంలోని కొత్తగూడెం జిల్లాకు చెందిన ఓ ఫొటోగ్రాఫర్‌(photographer) తన వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి వినూత్న ఆలోచన చేశాడు. స్మార్ట్‌ఫోన్లు చేతిలోకొచ్చాక నానాటికీ పడిపోతున్న గిరాకీ కాస్తయినా పెరుగుతుందని ఏ స్పెషల్ ఆఫర్‌ ప్రకటించాడు. తన స్టూడియోలో పాస్‌పోర్ట్ ఫోటోలు తీసుకున్న వారికి పావుకిలో టమటాల ప్యాకెట్ ను ఫ్రీగా ఇస్తామని ఆఫర్ ప్రకటించాడు.

టమాటా ఆఫర్




 


కొత్తగూడెం బస్టాండ్‌ కాంప్లెక్స్‌లో పట్టణానికి చెందిన ఆనంద్‌(photographer anand) అనే వ్యక్తికి ఫొటో స్టూడియో ఉంది. గతంలో స్థానికంగా కలెక్టరేట్‌ ఉన్నప్పుడు వ్యాపారం బాగానే నడిచేది. ఇటీవల జిల్లా కలెక్టరేట్‌తోపాటు ఇతర ప్రధాన కార్యాలయాలను పాల్వంచ సమీపంలోని సమీకృత జిల్లా కార్యాలయానికి మార్చడంతో గిరాకీ తగ్గింది. గతంలో రోజుకు 20-30 మంది కస్టమర్లు వచ్చేశారు. ఇప్పుడు కనీసం రోజుకు ఇద్దరు ముగ్గురు కూడా రావడం లేదు. దీంతో కస్టమర్లను అకట్టుకోవడానికి టమాటా ఆఫర్‌(Tomato Offer) ప్రకటించాడు. తన వద్ద రూ.100లకు 8 పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోలు తీసుకున్న వారికి పావు కిలో టమాటా ఉచితం అంటూ ప్రకటించి జనాల దృష్టిని ఆకట్టున్నారు. ఈ మేరకు పట్టణంలోని ప్రధాన రోడ్ల కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లో ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసి ప్రజలకు తెలిసేలా చేశాడు. ఇది చూసిన జనాలు అతని స్టూడియోకు రావడం మొదలు పెట్టారు.

రెస్పాన్స్ అదుర్స్

కట్‌ చేస్తే.. ఆనంద్‌ ఫొటో స్టూడియో ముందు జనాలు బారులు తీరారు. బుధవారం ఒక్కరోజే ఏకంగా 32 మంది కస్టమర్లు వచ్చారు. రూ.100 చెల్లించి 8 ఫొటోలు తీసుకున్న వారికి రూ.40 విలువైన పావు కిలో టమాటా ప్యాకెట్లు అందజేసినట్లు’ ఆనంద్‌ తెలిపాడు. ఆనంద్‌ వినూత్న ప్రచారానికి మంచి స్పందన లభించినట్లైంది. 



 


Tags:    

Similar News