బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రాసలీలలు..!! వైరల్ అవుతోన్న ఫొటోలు
ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్‌ను వివాదం చుట్టుముట్టింది. ఆయన ఓ మహిళతో అత్యంత సన్నిహితంగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే, ఈ ఫోటోలు మార్ఫింగ్ చేసినవంటూ కొట్టిపారేశారు మదన్‌లాల్ అనుచరులు. ఎమ్మెల్యే రాములు నాయక్ వర్గం కావాలనే వీటిని వైరల్ చేస్తోందని ఆరోపిస్తున్నారు.
మదన్ లాల్ వైరా నియోజకవర్గంలో కీలక నేతగా ఉన్నారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాములు నాయక్ గత ఎన్నికల్లో రెబల్‌గా పోటీ చేసి మదన్‌లాల్‌పై గెలిచారు. ఆయన ఎన్నికల్లో గెలిచాక బీఆర్ఎస్‌లోకి వచ్చారు. రాములు నాయక్ పొంగులేటి వర్గంతో కలిసి అప్పుడు పార్టీలోకి వచ్చారు. ఇప్పుడు పొంగులేటి వెళ్లినా బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు. ఇటీవల బీఆర్ఎస్ నాయకత్వం చేయించిన సర్వేలో రాములు నాయక్‌పై వ్యతిరేకత వచ్చిందని పార్టీ శ్రేణుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగానే తన ప్రత్యర్థుల్ని రాములు నాయక్ టార్గెట్ చేశారని మదన్ లాల్ వర్గం ఆరోపిస్తోంది.
ప్రస్తుతం రాములు నాయక్‌కి పోటీ అంటే మదన్‌లాల్ నుంచే ఉందని, అందుకే ఆయన క్యారెక్టర్‌ను డీగ్రేడ్ చేసేలా ఈ ఫొటోలు వైరల్ చేశారని ఆరోపిస్తున్నారు మదన్ లాల్ అనుచరులు. అయితే, ఈ వ్యవహారంతో తమకు సంబధం లేదని ఎమ్మెల్యే రాములు నాయక్ వర్గం అంటుంటే.. ఇది వాళ్ల పనేనని మదన్‌లాల్ వర్గం ఆరోపిస్తోంది. మరి ఈ వ్యవహారం ఎటువైపు దారి తీస్తుందో చూడాలి.