ఓట్ల పండగను గట్టిగా జరుపుకోండి.. మోదీ, కేటీఆర్

By :  Lenin
Update: 2023-11-30 03:43 GMT

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సజావుగా సాగుతోంది. కొన్ని చోట్ల ఎప్పట్లాగే ఈవీఎం మొరాయించడం, పోలింగ్ ఆలస్యంగా మొదలవడం వంటి ఘటలను మినహాయిస్తే పోలింగ్ చక్కగా సాగుతోంది. సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు పొద్దుపొద్దునే బూత్ లకు వెళ్లి ఓటేస్తున్నారు. అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతున్నారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం కోసం విస్తృతంగా పర్యంటించిన ప్రధాని నరేంద్ర మోదీ కూడా అందరూ ఓటేయాలని కోరుతూ తెలుగులో ట్వీట్ చేశారు.

‘‘తెలంగాణలోని నా సోదర సోదరీమణులు రికార్డు స్థాయిలో ఓటు వేసి ప్రజాస్వామ్య పండుగను బలోపేతం చేయాలని నేను పిలుపునిస్తున్నాను. యువకులు మరీ ముఖ్యంగా మొదటిసారిగా ఓటు వేస్తున్నవారు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని నేను ప్రత్యేకంగా కోరుతున్నాను.’’ అని విజ్ఞప్తి చేశారు.

ఓటు హక్కు వినియోగించుకుని తెలంగా ఉజ్వల భవితకు బంగారు బాట వేయాలని మంత్రి కేటీఆర్ కూడా కోరారు. ‘‘మీ ఓటు.. పరుగులు పెడుతున్న తెలంగాణ ప్రగతికి పునాదిగా నిలవాలి మీ ఓటు.. తెలంగాణ ఉజ్వల భవితకు బంగారు బాటలు వేయాలి మీ ఓటు.. తెలంగాణ రైతుల జీవితాల్లో వెలుగులు కొనసాగించాలి మీ ఓటు.. వ్యవసాయ విప్లవానికి వెన్నుముకగా నిలవాలి మీ ఓటు.. మహిళల ముఖంలో చెరగని చిరునవ్వులు నింపాలి మీ ఓటు.. యువత ఆకాంక్షలను నెరవేర్చే అవకాశాల అక్షయపాత్ర కావాలి మీ ఓటు.. సబ్బండ వర్ణాల్లో.. సంతోషాన్ని పదిల పరచాలి మీ ఓటు.. తెలంగాణ ఆత్మగౌరవ పతాకాన్ని సమున్నతంగా, సగర్వంగా ఎగరేయాలి మీ ఓటు.. తెలంగాణ రాష్ట్ర ముఖచిత్రాన్ని తెలంగాణ ప్రజల బతుకు చిత్రాన్ని మరింత అందంగా తీర్చిదిద్దాలి మీ చేతిలోని వజ్రాయుధాన్ని ఎట్టి పరిస్థితుల్లో వృధాకానివ్వకండి అందుకే.. ప్రజాస్వామ్య పండుగలో భాగస్వామ్యం కండి.. అందరూ రండి..! ప్రతి ఒక్కరూ "ముచ్చటగా..." ఓటు హక్కును వినియోగించుకొండి..!! జై తెలంగాణ జై భారత్’’ అని ట్వీట్ చేశారు.

Tags:    

Similar News