Turmeric Board : తెలంగాణకు మోదీ వరాలు.. ఎన్నికల వేళ అదిరిపోయే..
తెలంగాణపై ప్రధాని మోదీ వరాలు కురిపించారు. నిజామాబాద్ రైతలు చిరకాల కోరిక అయిన పసుపు బోర్టును ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. పసుపు రైతుల కోసం నేషనల్ టర్మరిక్ బోర్డు ఏర్పాటు చేస్తామని మహబూబ్ నగర్లో జరిగిన సభలో ప్రకటించారు. దీనివల్ల ఎంతో మంది రైతులకు లబ్ది చేకూరనుంది. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని.. గత ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి పోటీ చేసిన అర్వింద్ హామీ ఇచ్చారు. అయితే ఎన్నికలు అయిపోయాక బీజేపీ దానిని పక్కనపడేసిందని బీఆర్ఎస్ ఆరోపణలు గుప్పించింది. దీనిపై బీజేపీ బీఆర్ఎస్ - బీజేపీ మధ్య మాటల యుద్ధం నడించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముంగిట మోదీ పసుపు బోర్డు ప్రకటించడం గమనార్హం.
అదేవిధంగా ములుగు జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు. సమ్మక్క-సారక్క పేరుతో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు. 900 కోట్లతో ఈ యూనివర్సిటీని కేంద్రం ఏర్పాటు చేయనుంది. కాగా ములుగు జిల్లాకు గిరిజన యూనివర్సిటీపై ఎప్పటినుంచో డిమాండ్ ఉంది. కేసీఆర్ సర్కార్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ఎన్నోసార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. అయితే ఇన్నాళ్లు దానిపై ఎటూ తేల్చని కేంద్రం ఎట్టకేలకు యూనివర్సిటీ ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.