మరోసారి తెలంగాణకు మోడీ.. పవన్తో కలిసి 3 రోజులు ప్రచారం

Update: 2023-11-21 16:24 GMT

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ప్రచారానికి మరో వారం రోజుల సమయం మాత్రమే ఉండటంతో అన్ని పార్టీలు జోష్ పెంచాయి. ఈ క్రమంలోనే బీజేపీ జాతీయ నేతలు రాష్ట్రంలో దృష్టి సారించనున్నారు. రాజస్థాన్ ఎన్నికల ప్రచారం ముగియడంతో ప్రధాని మోడీ సహా పలువురు నేతలు తెలంగాణపై దృష్టి సారించనున్నారు. వరుస సభలతో హోరెత్తించనున్నారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ మరోసారి తెలంగాణకు రానున్నారు. ఈ మేరకు షెడ్యూల్‌ ఖరారైంది. ఈనెల 25న మోడీ మహేశ్వరం, కామారెడ్డి సభల్లో పాల్గొంటారు. 26న తూఫ్రాన్‌, నిర్మల్‌, 27న మహబూబాబాద్‌, కరీంనగర్‌ ప్రచార సభల్లో ప్రసంగించనున్నారు. అదే రోజు సాయంత్రం హైదరాబాద్‌లో జరిగే రోడ్‌షోలో ప్రధాని పాల్గొంటారు. ప్రధాని మోడీతో పాటుజనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రచార సభల్లో పాల్గొంటారని బీజేపీ వర్గాలు చెప్పాయి.

Tags:    

Similar News