ప్రధాని మోదీ రోడ్‌షో మల్కాజ్‌గిరి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో మీర్జాలగూడ నుంచి మల్కాజ్‌గిరి చౌరస్తా వరకు 1.3 కి.మీ మేర కొనసాగింది. మీర్జలగూడలో మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజేందర్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కలిసి మోదీ ఎన్నికల రథంపై కార్యకర్తలకు అభివాదం చేశారు.
ప్రధాని పర్యటన సందర్భంగా భారీ ఎత్తున బీజేపీ శ్రేణులు అక్కడికి చేరుకున్నారు.ఈ రోడ్ షో నేపథ్యంలో రాష్ట్ర, కేంద్ర బలగాలు కట్టదిట్టం చేశాయి. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ రోడ్ షోలను నిర్వహిస్తుంది. అయితే, ఈ రాత్రికి రాజ్‌భవన్‌లోనే ప్రధాని మోదీ బస చేయనున్నారు. నాగర్‌కర్నూల్‌లో శనివారం (మార్చి 16న) పర్యటించనున్నారు. అనంతరం ప్రధాని మోదీ కర్ణాటక బయల్దేరి వెళ్లనున్నారు.