kishan reddy : ఇందిరా పార్క్ వద్ద ఉద్రిక్తత.. కిషన్ రెడ్డి దీక్ష భగ్నం..

Byline :  Kiran
Update: 2023-09-13 15:03 GMT

ఇందిరాపార్క్ వద్ద బీజేపీ చేపట్టిన 24 గంటల దీక్ష భగ్నం అయ్యింది. దీక్షను భగ్నం చేసిన పోలీసులు.. కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అయితే బీజేపీ శ్రేణులు పోలీసులను అడ్డుకోవడంతో అక్కడ అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

కేసీఆర్ సర్కారు వైఖరిని నిరసిస్తూ బీజేపీ బుధవారం ఉదయం 24 గంటల ఉపవాస దీక్ష చేపట్టింది. కిషన్ రెడ్డి నేతృత్వంలో గురువారం ఉదయం 6గంటల వరకు దీక్ష కొనసాగించాలని నిర్ణయించింది. అయితే సాయంత్రం 6గంటలకు దీక్షా శిబిరం వద్దకు చేరుకున్న పోలీసులు సమయం ముగిసిపోయిందని చెప్పారు. ఆ స్థలాన్ని ఖాళీ చేసి వెళ్లాలని చెప్పారు. అయితే బీజేపీ నేతలు మాత్రం అందుకు నిరాకరించారు. తమది 24 గంటల దీక్ష అని తెల్లవారే దాక కొనసాగిస్తానని కిషన్ రెడ్డి భీష్మించుకున్నారు.

పోలీసులు కిషన్ రెడ్డి మధ్య చాలా సేపు చర్చలు జరిగాయి. అయితే ఆయన దీక్ష విరమణకు ససేమిరా అనడంతో శిబిరాన్ని చుట్టుముట్టిన పోలీసులు అక్కడున్న వారిని బయటకు పంపే ప్రయత్నం చేశారు. ఈక్రమంలోనే కిషన్ రెడ్డిని అక్కడి నుంచి బలవంతంగా తరలించేందుకు సిద్ధమయ్యారు. దీంతో బీజేపీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కిషన్‌రెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనూ దీక్ష శిబిరాన్ని ఖాళీ చేసేందుకు అంగీకరించకపోవడంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. 




Tags:    

Similar News