బిగ్ ట్విస్ట్... సర్పంచ్ నవ్య ఆరోపణల్లో నిజాలు లేవు.. పోలీసులు

Update: 2023-07-05 08:09 GMT

సర్పంచ్ నవ్య వర్సెస్ ఎమ్మెల్యే రాజయ్య ఎపిసోడ్‌లో.. మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. సర్పంచ్ నవ్య ఆరోపణల్లో నిజాలు లేవని.. అవన్నీ నిరాధారాలని తేల్చారు పోలీసులు. స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై.. సర్పంచ్ నవ్య లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆ ఆరోపణలో నిజం లేదని , ఆధారాలు సమర్పించడంలో ఆమె విఫలమయ్యారని..దీనికి సంబంధించిన నివేదికను జాతీయ మహిళా కమీషన్ కు పంపించనున్నట్టు తెలిపారు. రెండు పర్యాయాలు నోటీసులు ఇచ్చినా ఆమె ఎలాంటి ఆధారాలూ నవ్య సమర్పించలేదని, నిర్ణీత సమయానికి ఆధారాలు సమర్పించని నేపథ్యంలో కేసు క్లోజ్ చేయవచ్చని ఆమే ఇంతకుముందు తెలిపిందని పోలీసులు వివరించారు. ఈ క్రమంలోనే ఈ కేసును క్లోజ్ చేస్తున్నట్లు తెలిపారు.




 


ఎమ్మెల్యే రాజయ్య తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ కొన్ని రోజుల క్రితం హన్మకొండ జిల్లా జానకీపురం సర్పంచ్ నవ్య సంచలన ఆరోపణలు చేశారు. మాట విననందుకు తనపై రాజయ్య లైంగిక వేధింపులకు దిగుతున్నారని వాపోయారు. అప్పట్లో చేసిన లైంగిక ఆరోపణలకు సంబంధించిన టేపులు ఇవ్వాలని ఆయన అనుచరులతో ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. తనకు తన భర్తకు మధ్య చిచ్చుపెట్టి ఎమ్మెల్యే రాజయ్య పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు

నవ్య ఆరోపణలను సుమోటోగా స్వీకరించిన జాతీయ, రాష్ట్ర మహిళా కమిషన్‌లు విచారణ చేపట్టి నివేదిక అందించాల్సిందిగా పోలీసు అధికారులను ఆదేశించాయి. పోలీసులు కూడా నవ్యకు నోటీసులు జారీ చేశారు. పోలీస్ స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదుపై ఇంకా ఏమైనా సాక్ష్యాధారాలు ఉంటే రెండు రోజుల్లో సమర్పించాలని ధర్మసాగర్ సిఐ రమేష్ ఆమెకు నోటీసులు ఇచ్చారు. కానీ ఆమె నుంచి ఎలాంటి ఆధారాలు అందకపోవడంతో ఈ ఆరోపణల్లో నిజం లేదని పోలీసులు నిర్ధారించారు.




Tags:    

Similar News