సీఎంని తిట్టిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే.. పోలీసుల నోటీసులు
బాల్క సుమన్కు మంచిర్యాల పోలీసులు నోటీసులు జారీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని దూషించిన కేసులో విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తనపై అక్రమంగా కేసు పెట్టిందని సుమన్ ఆరోపించారు. ఉద్యమంలో ఎన్నో కేసులు ఎదుర్కొన్నట్లు తెలిపిన ఆయన.. కాంగ్రెస్ హామీలు నెరవేర్చే వరకు ప్రజల పక్షాన పోరాడుతానని స్పష్టం చేశారు. ఇదే కేసులో సుమన్ నేపాల్ పారిపోయారంటూ ప్రచారం జరిగింది. అయితే అదంతా అసత్య ప్రచారమని ఆయన ఖండించారు.
కాగా కేసీఆర్‌ను రం.. అన్న రేవంత్ రెడ్డే పెద్ద రం.. అని బాల్క సుమన్ అసభ్య పదజాలంతో దూషించారు. సీఎం రేవంత్ రెడ్డిని చెప్పుతో కొట్టాలని ఉందని.. కానీ సంస్కారం అడ్డువస్తుందని విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో ఆయన చెప్పును చూపిస్తూ అత్యుత్సాహం ప్రదర్శించారు. ఈ వ్యాఖ్యలపై సీరియస్ అయిన కాంగ్రెస్ నేతల మంచిర్యాల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో మంచిర్యాల పోలీసులు బాల్క సుమన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 294బీ, 504, 506 సెక్షన్ల కింద కేసు రిజిష్టర్ చేశారు.