ప్రవళిక ఆత్మహత్య కేసు.. మరో ఎవిడెన్స్ గుర్తించిన పోలీసులు..!

Byline :  Bharath
Update: 2023-10-17 16:38 GMT

తెలంగాణలో సంచలనం సృష్టించిన ప్రవళిక ఆత్మహత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రవళికను శివరాం అనే వ్యక్తి ప్రేమ ప్రేరుతో మోసం చేశాడని పోలీసులు చాటింగ్ ద్వారా గుర్తించారు. శివరాం మోసం చేశాడని ప్రవళిక.. తన సోదరుడికి మెసేజ్ పెట్టినట్లు పోలీసులు తేల్చారు. శివరాం వేధింపుల వల్లే ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని ఎఫ్ఐఆర్ లో పేర్కొచ్చారు. ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీసులు శివరాంపై కేసు నమోదు చేసి.. అతడిపై సెక్షన్ 420తో పాటు 417, 306 సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. శివరాం మోసం చేసినట్లు ఆమె కుటుంబసభ్యుల నుంచి పోలీసులు ఆధారాలు సేకరించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడి శివరాం కోసం పోలీసులు గాలిస్తున్నారు.




Tags:    

Similar News