Bhuvanagiri Girls Hostel : ఇద్దరు స్టూడెంట్స్ ఆత్మహత్య.. భువనగిరి ఎస్సీ హాస్టల్ ముందు ఉద్రిక్తత

Byline :  Krishna
Update: 2024-02-04 08:08 GMT

(Bhuvanagiri Girls Hostel) భువనగిరిలో ఇద్దరు స్టూడెంట్స్ ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. ఎస్సీ బాలికల హాస్టల్లో భవ్య, వైష్ణవి అనే విద్యార్థినిలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. విద్యార్థినుల గదిలో సూసైడ్ లెటర్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. స్కూల్లో జరిగిన గొడవ వల్లే బాలికలు ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ కోణంలో టీచర్లు, బాలికల స్నేహితులను విచారిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి.

భువనగిరి ఎస్సీ హాస్టల్ ముందు విద్యార్థి నాయకులు, ప్రజాసంఘాల నాయకులు ఆందోళన చేపట్టాయి. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. కలెక్టర్‌ హామీ ఇచ్చేంత వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థి సంఘాల ఆందోళనతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు తమ పిల్లలది ఆత్మహత్య కాదని.. హత్య చేశారంటూ వారి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. సూసైడ్ లెటర్లోని రాత తమ పిల్లలది కాదని చెబుతున్నారు. 

అసలేం జరిగిందంటే..?

హైదరాబాద్‌లోని హబ్సిగూడకు చెందిన భవ్య, వైష్ణవి ఎస్సీ హాస్టల్లో ఉంటూ రెడ్డివాడ గర్ల్స్ హైస్కూల్లో టెన్త్ క్లాస్ చదువుతున్నారు. శనివారం స్కూల్కు వెళ్లొచ్చిన విద్యార్థినులు సాయంత్రం ట్యూషన్కు వెళ్లలేదు. రాత్రి భోజనం చేశాక ట్యూషన్కు వస్తామంటూ టీచర్కు చెప్పారు. అయితే భోజనం చేయడానికి కూడా వారు రాకపోవడంతో వాళ్ల ఫ్రెండ్స్ కు డౌట్ వచ్చింది. రూమ్ కు వెళ్లి చూడగా.. రెండు ఫ్యాన్లకు ఇద్దరు ఉరి వేసుకుని కనిపించారు. టీచర్లు వెంటనే వారిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు స్పష్టం చేశారు. 


Tags:    

Similar News