Pragathi Bhavan : ప్రగతి భవన్ వద్ద బారికేడ్లను తొలగిస్తున్న పోలీసులు

Byline :  Krishna
Update: 2023-12-07 07:00 GMT

ప్రగతి భవన్.. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు సామాన్యులు అక్కడికి వెళ్లడం అసాధ్యం. అపాయింట్మెంట్ ఉంటే తప్ప వెళ్లడం కుదరదు. ఒక్కోసారి ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం లోపలికి వెళ్లలేని పరిస్థితి ఉండేది. అంతలా కఠిన ఆంక్షలు ఉండేవి. కానీ ప్రభుత్వం మారింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రగతి భవన్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రగతి భవన్ను ప్రజాభవన్గా మార్చింది. ఇకపై సామాన్యులు సైతం అక్కడివెళ్లేలా వీలు కల్పిస్తున్నారు. ఈ క్రమంలో రోడ్డుపై ఉన్న బారికేడ్లను పోలీసులు తొలగిస్తున్నారు.

ఉన్నతాధికారుల ఆదేశాలతో పోలీసులు జేసీబీల సాయంతో బారికేడ్లను తొలగిస్తున్నారు. ఒకటి, రెండ్రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి కానుంది. రోడ్డుపై ఉన్న బారికేడ్ల లోపల నుంచి కూడా వాహనాలు వెళ్లేందుకు పోలీసులు అనుమతించారు. కాగా ప్రగతి భవన్ తలుపులు సామాన్యుల కోసం ఎప్పుడూ తెరిచేవుంటాయని రేవంత్ ప్రకటించారు. వైఎస్ తరహాలో ప్రతి రోజు ప్రజాదర్బార్ నిర్వహించేందుకు రేవంత్ ప్లాన్ చేస్తున్నారు. కాగా కాసేపట్లో సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎల్బీ స్టేడియంలో 1.04 గంటలకు గవర్నర్ తమిళిసై ఆయనతో ప్రమాణం చేయిస్తారు. రేవంత్ తో పాటు 11మంది మంత్రులుగా ప్రమాణం చేస్తున్నారు.


Tags:    

Similar News