బీఆర్ఎస్ కుట్ర.. సభకు వచ్చే వాహనాలు సీజన్ చేస్తున్నారు : పొంగులేటి

Update: 2023-07-02 06:35 GMT

ఖమ్మంలో రాజకీయాలు వేడెక్కాయి. జన గర్జన పేరుతో ఖమ్మంలో ఇవాళ సాయంత్రం కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ సభకు రాహుల్ గాంధీ వస్తున్నారు. అయితే ఈ సభను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ కుట్రలు చేస్తోందంటూ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. ఆర్టీసీ బస్సులు అద్దెకు ఇవ్వడం లేదని.. ప్రైవేట్ వాహనాలను చెక్ పోస్టులు పెట్టి అడ్డుకుంటున్నారని విమర్శించారు. రాత్రి నుంచి రోడ్లు బ్లాక్ చేసి భయానక వాతావరణం సృష్టిస్తున్నారని మండిపడ్డారు.

జన గర్జన సభతోనే బీఆర్ఎస్ పార్టీ పతనం మొదలవుతుందని పొంగులేటి అన్నారు. ‘‘మా సభను అడ్డుకునే కుట్రలు జరుగుతున్నాయి. ప్రభుత్వ కనుసన్నల్లో అధికారులు పనిచేస్తున్నారు. అన్ని ప్రాంతాల్లో రోడ్లను మూసివేయిస్తూ, కాంగ్రెస్ కార్యకర్తల్ని భయబ్రాంతులకి గురిచేస్తున్నారు. ఇప్పటికే 1700 వాహనాలను సీజ్ చేశారు. వారు అధికార దాహంతో వ్యవహరిస్తున్నారు. అవసరమైతే నేను రోడ్డు మీదకు వస్తా’’ అని పొంగులేటి అన్నారు.

మరోవైపు ఖమ్మం మొత్తం కాంగ్రెస్ జెండాలు, ఫ్లెక్సీలు, కటౌట్లతో కళకళలాడుతోంది. ఈ సభలోనే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు సహా పలువురు నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకుంటారు. సాయంత్రం నాలుగు గంటలకు రాహుల్ గన్నవరం చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్లో సభాస్థలికి చేరుకుంటారు. గంటన్నర పాటు సభా వేదికపై రాహుల్ గాంధీ ఉంటారు. సభ అనంతరం రోడ్డు మార్గం ద్వారా రాహుల్ గన్నవరం చేరుకోని.. అక్కడి నుంచి ఢిల్లీ వెళ్తారు. 


Tags:    

Similar News