తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించి సోనియా రాష్ట్రాన్ని ఇచ్చారన్నారు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. తెలంగాణకు కేసీఆర్ చేసింది ఏంలేదని విమర్శించారు. ఖమ్మం సభ వేదికగా కాంగ్రెస్‌లో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చేరారు. కాంగ్రెస్ కండువా కప్పిన రాహుల్ గాంధీ పార్టీలోకి ఆహ్వానించారు. పొంగులేటితో పాటు పిడమర్తి రవి, అరికెల నర్సారెడ్డి, పాయం వెంకటేశ్వర్లు, కనకయ్య, డీవీ రావు, పాపిరెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఈ సందర్బంగా పొంగులేటి మాట్లాడుతూ " మాయమాటలు, మోసపూరిత మాటలు చెప్పి కేసీఆర్ అధికారంలోకి వచ్చారు. చెప్పిన వాగ్దానాలు, ఇచ్చిన హామీలేవి పూర్తి చేయలేదు. 2014,2018లో రైతు రుణ మాఫీ చేస్తామని చెప్పి చేయలేదు. కేసీఆర్ నిరుద్యోగులను మోసం చేశాడు. ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వలేదు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియానే. తెలంగాణ ప్రజల ఆకాంక్షను ఆమె గౌరవించారు. 2014లో తెలంగాణ బిడ్డల ఆత్మాభిమానాన్ని గౌరవించి తెలగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఇచ్చింది . ఆరోజు యువకుల బలిదానాలు ఆపడానికి పార్టీ ప్రయోజనాలను కూడా పక్కన బెట్టి ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తోంది. యావత్ దేశంలో కాంగ్రెస్ గ్రాఫ్ బాగా పెరిగింది. బీఆర్ఎస్‌ను కాంగ్రెస్ మాత్రమే బంగాళఖాతంలో పడేయగలదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు డిక్లరేషన్‌లో చెప్పినవన్నీ పూర్తి చేస్తాం" అని పొంగులేటి హామీ ఇచ్చారు
సుమారు ఆరు నెలల తర్వాత నిర్ణయం తీసుకుని కాంగ్రెస్ లో చేరినట్లు పొంగులేటి తెలిపారు. అనేక ప్రాంతాలు తిరిగి..అందరి అభిప్రాయాలు తీసుకునే చేరానని వివరించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి, తమకు మంచి జరుగుతుందని తెలంగాణ ప్రజల సూచన మేరకు పార్టీలో చేరినట్లు పొంగులేటి వెల్లడించారు.
Ponguleti srinivas reddy joined the Congress In khammam