ప్రగతిశీల మహిళ సంఘం అధ్యక్షురాలు సంధ్య ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె భర్త రామకృష్ణారెడ్డి కన్నుమూశారు. గుండెపోటు కారణంగా ఆయన్ను హైదర్‌గూడలోని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు.చికిత్స పోందుతూ శుక్రవారం మృతి చెందారు. దీంతో వివిధ ప్రజాసంఘాల ప్రతినిధులు, ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. సంధ్య భర్త మృతి చెందిన విషయం తెలిసి వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు ఆసుపత్రికి చేరుకున్నారు. వారు రామకృష్ణా రెడ్డికి నివాళులు అర్పించారు. ఆయన భార్య సంధ్యను ఓదార్చారు. గతంలో అగ్ర నేత ఆర్కే జీవిత చరిత్రను ప్రింట్ చేస్తున్నట్టు పోలీసులు ఆయన అరెస్ట్ చేశారు. నవ్య ప్రింటింగ్ ప్రెస్ పీవోడబ్ల్యూ సభ్యురాలు సంధ్య భర్త రామకృష్ణారెడ్డి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తనిఖీల సమయంలో ఆర్కే భార్య శిరీష, పీవోడబ్ల్యూ సభ్యురాలు సంధ్య ప్రింటింగ్ ప్రెస్ వద్దకు చేరుకున్నారు. బైండింగ్ చేసిన వెయ్యి పుస్తకాలను, మెటిరియల్‌ను సీజ్ చేశారు.