సీఎంను చేస్తే ఒక్కో నియోజకవర్గానికి వెయ్యి కోట్లు ఇస్తా - కేఏ పాల్
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్, కేటీఆర్ తనపై దాడులు చేయించి ఇబ్బంది పెట్టారని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగనున్న 12 మంది అభ్యర్థుల జాబితాను ఆయన విడుదల చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పాల్.. ప్రతి నియోజకవర్గం రూ.100కోట్లతో అభివృద్ధి చేస్తామని అన్నారు.
షర్మిలలా తాను ప్యాకేజీ స్టార్ కాదని కేఏ పాల్ అన్నారు. రేవంత్ రెడ్డికి షర్మిల, కోదండరాం మద్దతిస్తారని ముందే చెప్పానని.. ఆయనకు సపోర్ట్ చేయాలని బండ్ల గణేష్ తనకు కాల్ చేశాడని చెప్పారు. తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని, తనను బెదిరించి రాజకీయం చేయడం ఎవరి తరం కాదని స్పష్టం చేశారు.
తనను కొనేవాడు భూమ్మీద లేడని కేఏ పాల్ అన్నారు. ఛారిటీ ద్వారా వచ్చే డబ్బులన్నింటినీ రాకుండా చేసి తనను రోడ్డు పాలు చేశారని మండిపడ్డారు. అధికార దాహంతో తనను ఇబ్బంది పెడుతున్న వారందరికీ సమాధానం చెప్పే రోజు దగ్గర్లోనే ఉందని అన్నారు. తమ పార్టీకి మెజార్టీ కట్టబెట్టి తనను సీఎంను చేస్తే నియోజకవర్గానికి రూ.100 నుంచి 1000కోట్లు ఇస్తానని పాల్ ప్రకటించారు.