Prajapalana:అభయహస్తం దరఖాస్తుకు అప్లై చేసిన 'మహాశివుడు'!!

Byline :  Veerendra Prasad
Update: 2024-01-07 06:25 GMT

కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమం నిన్న శనివారం తో ముగిసింది. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు సంబదించిన పథకాల కోసం ప్రజల నుండి దరఖాస్తు పత్రాలను స్వీకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కోటి 25 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఈ క్రమంలో హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముత్తారం గ్రామంలో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది.

ఏకంగా పరమ శివుడి పేరిట దరఖాస్తు ప్రజా పాలనలో అధికారులకు అందింది. అయితే, అందుకు సంబంధించిన దరఖాస్తు ఫారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో అర్జీదారు శివుడు కాగా, కుంటుంబ వివరాల కాలమ్‌లో భార్య పార్వతి, కుమారుల పేర్లు కుమార స్వామి, వినాయకుడు అని రాసి ఉంది. ఏనుగు వెంకట సురేందర్ రెడ్డి అనే వ్యక్తి పేరుతో అధికారులకు ఈ దరఖాస్తు అందింది. అధికారులు ఈ దరఖాస్తును పరిశీలించకుండా దీనిపై స్టాంప్ వేశారు. దీనిపై నెటిజన్లు భిన్నరకాలుగా కామెంట్ చేస్తున్నారు. 




Tags:    

Similar News