తెలంగాణ బీజెపీ ఎన్నికల ఇంఛార్జ్ గా ప్రకాష్ జవదేకర్

Update: 2023-07-07 12:20 GMT

ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో బీజెపీ దానికి తగ్గ ప్రయత్నాలు మొదలుపెట్టింది. తెలంగాణలో పార్టీ అధికారులను, ఇంఛార్జ్ల ను నియమిస్తోంది. తాజాగా తెలంగాణ ఎన్నికల ఇంఛార్జ్ గా జాతీయ స్థాయి సీనియర్ నేత ప్రకాష్ జవదేకర్ ను నియమించింది పార్టీ అధిష్టానం. అలాగే సహాయ్ ఇంఛార్జ్ గా సునీల్ బన్సల్ ను అప్పాయింట్ చేసింది.

ఈ సారి ఎన్నికల్లో తెలంగాణలో తమ జెండా పాతాలని బీజెపీ భావిస్తోంది. దానికి తగ్గ చర్యలను తీసుకుంటోంది. పార్టీకి ఎవరైతే మేలు చేకూరుస్తారో వాళ్ళందరినీ రంగంలోకి దించుతోంది. తెలంగాణలో బీజెపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ ను తప్పించి కిషన్ రెడ్డిని నియమించింది. ఇప్పుడు సీనియర్ నేత ప్రకాష్ జవదేకర్ ను ఎన్నికల ఇంఛార్జ్ గా అపాయింట్ చేసింది. జవదేకర్ సీనియారిటీ ఎన్నికల్లో గెలిచేందుకు ఉపయోగపడుతుందని పార్టీ అధిష్టానం భావిస్తోంది.

Tags:    

Similar News