Mulugu District : లేడి గెటప్‌తో ప్రాంక్ చేయబోయిన ప్రభుత్వ ఉద్యోగి .. చితకబాదారు

Update: 2024-02-14 08:19 GMT

బుద్ధిగా వచ్చిన సర్కార్ కొలువును వెలగబెట్టకుండా.. ప్రాంక్‌ల మోజుతో ప్రాణాల మీదకు తెచ్చుకొన్నాడో ప్రభుత్వ ఉద్యోగి. లేడీ గెటప్‌లతో జనాన్ని ఆటపట్టిద్దామనుకుంటే.. అదే జనం చిన్న పిల్లలను కిడ్నాప్ చేసేందుకు వచ్చిన హిజ్రా అనుకొని చావబాదారు. నేను కిడ్నాపర్‌ని కాదు మొర్రో అని మొత్తుకున్నా వినలేదు. పిడిగుద్దులు కురిపిస్తూ .. రౌండప్ చేసి, చివరకు పోలీసులకు అప్పగించారు. ములుగు జిల్లా కేంద్రంలో మంగళవారం రాత్రి ఈ సంఘటన జరిగింది.

ఎస్సై వెంకటేశ్వర్‌ కథనం ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గుమ్మలపల్లికి చెందిన బి.వేణుగోపాల్ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. ప్రాంక్‌ లు చేయడం అలవాటుగా ఉన్న వేణుగోపాల్ మంగళవారం సాయంత్రం ములుగుకు వచ్చాడు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖాన వద్ద పలువురిని ఆడవేషంలో ప్రాంక్‌ చేసే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో స్థానికులు ఆడవేషంలో ఉన్నది మగ వ్యక్తి అని గురించి, ఇటీవల చిన్న పిల్లలను కిడ్నాప్‌ చేసే ముఠాగా భావించి, చితకబాది పోలీసులకు అప్పగించారు.

అతడిని అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారించగా తాను గుమ్మలపల్లి జీపీ కార్యదర్శి వేణుగోపాల్‌గా చెప్పాడు. వృత్తి రీత్యా కార్యదర్శిగా పనిచేస్తూ అప్పుడప్పుడు ఆడ వేషం లో ప్రాంక్‌ చేయడం సరదాగా అని తెలిపారు. పూర్తి వివరాలు తెలుసుకున్న అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం ఇ చ్చామన్నారు. కాగా, ప్రభుత్వ ఉ ద్యోగం చేస్తూ ఇలా చేయడమేమిటని మందలించి కౌన్సెలింగ్‌ ఇచ్చినట్లు ఎస్సై చెప్పారు.




Tags:    

Similar News