హైదరాబాద్కు రాష్ట్రపతి.. ఘన స్వాగతం పలికిన సీఎం, మంత్రులు

Update: 2023-12-18 15:42 GMT

తెలంగాణలో తన 5 రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం రాత్రి హైదరాబాద్ కు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో భేగంపేట్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, సీఎస్ శాంతికుమారి, ఇతర ముఖ్య అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఇక శీతాకాల విడిదిలో భాగంగా 5 రోజుల పాటు రాష్ట్రపతి రాష్ట్రంలో ఉండనున్నారు. ఈ సందర్భంగా ఆమె బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్నారు. అక్కడే రాష్ట్రపతి ఈ నెల 23 వరకు విడిది చేస్తారు. తన విజిట్ లో భాగంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సందర్శించనున్నారు. అనంతరం ఈ నెల 23న ఆమె తిరిగి ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు.



Tags:    

Similar News