తెలంగాణ ప్రజలకు రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ శుభాకాంక్షలు

Update: 2023-06-02 05:20 GMT

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఇవాళ 10వ అవ‌త‌ర‌ణ దినోత్స‌వాన్ని జ‌రుపుకుంటోంది. ఈ సందర్భంగా ఇవాళ్టి నుంచి 21 రోజుల పాటు రాష్ట్రంలో ఆవిర్భావ వేడుకలు జరుగనున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గన్‎పార్క్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇదే క్రమంలో రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము, ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ .. తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు అవ‌త‌ర‌ణ దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపారు. ట్విటర్ వేదికగా ద్రౌపది ముర్ము రాష్ట్రం ప్రగతిపథంలో ముందుకు వెళ్లాలని ఆకాంక్షించగా, తెలుగులో ప్రజలకు మోదీ గ్రీటింగ్స్ తెలిపారు.




 

ట్విట్ట‌ర్‌ వేదికగా రాష్ట్ర‌ప‌తి ముర్ము తెలంగాణ ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్షలు తెలుపుతూ.." రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు నా శుభాకాంక్షలు. అడవులు, వన్యప్రాణులతో సమృద్ధిగా ఉన్న తెలంగాణ రాష్ట్రం గొప్ప సాంస్కృతిక వారసత్వం, ప్రతిభావంతులైన వ్యక్తులతో ప్రత్యేకంగా ఆశీర్వదించబడింది. ఈ అందమైన రాష్ట్రం ఆవిష్కరణ , వ్యవస్థాపకత యొక్క కేంద్రంగా అభివృద్ధి చెందుతోంది. తెలంగాణ అభివృద్ధి , శ్రేయస్సు ఇలాగే కొనసాగాలి, అనునిత్యం ప్రగతిపథంలో ముందుకు వెళ్లాలి"అని ముర్ము చెప్పారు.

ట్విటర్‎లో మోదీ తెలుగులో ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ.." తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అద్భుతమైన ఈ రాష్ట్ర ప్రజలకు నా శుభాకాంక్షలు. ఈ రాష్ట్ర ప్రజల నైపుణ్యాలు, సంస్కృతీ వైభవం ఎంతో గుర్తింపు పొందాయి. తెలంగాణ శ్రేయస్సు, సౌభాగ్యం కోసం నేను ప్రార్థిస్తున్నాను"అంటూ ఆయన ఆకాంక్షించారు.








Tags:    

Similar News