రాష్ట్రపతి హైదరాబాద్ పర్యటనలో ఆసక్తికర సన్నివేశం...

Update: 2023-07-04 05:41 GMT

దేశ రాష్ట్రపతి దౌప్రది ముర్ము మంగళవారం హైదరాబాద్ చేరుకున్నారు. హకీంపేట విమానశ్రయంలో రాష్ట్రపతికి గవర్నర్ తమిళ్ సై, సీఎం కేసీఆర్ మంత్రులతో పాటు ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గాన ఆమె రాష్ట్రపతి నిలయానికి చేరుకున్నారు. రాష్ట్రపతికి స్వాగతం పలికే కార్యక్రమంలో ఆసక్తిర సన్నివేశం చోటుచేసుకుంది. కొన్నిరోజులుగా నిప్పు ఉప్పుగా ఉన్న సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళ్ సై మాటలు కలిపారు. రాష్ట్రపతి రాకకు ముందే విమానాశ్రయం చేరుకున్న రాష్ట్ర గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్ నవ్వుతూ పలకరించుకున్నారు. పక్కపక్కనే కూర్చుని చాలాసేపు ముచ్చటించారు. రాష్ట్రపతి విమానం ల్యాండ్ అయ్యాక ఇద్దరూ కలిసి రన్ వే పై మాట్లాడుకుంటూ వెళ్లడం కనిపించింది. విభేదాలన్నీ పక్కన పెట్టి కేసీఆర్, తమిళిసై ఇద్దరూ రాష్ట్రపతికి స్వాగతం చెప్పడం, ఈ సందర్భంగా పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకోవడంపై ఆసక్తి నెలకొంది.




 


ఇక హైదరాబాద్ పర్యటనలో భాగంగా సాయంత్రం గచ్చిబౌలి స్టేడియంలో జరిగే అల్లూరి సీతారామరాజు 125 జయంతి ఉత్సవాల్లో రాష్ట్రపతి ముర్ము పాల్గొంటారు. ఇందుకోసం ఆమె హెలికాప్టర్‌లో రాష్ట్రపతి నిలయం నుంచి గచ్చిబౌలి చేరుకుంటారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో పలు రూట్లలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు సైబరాబాద్ లో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. గచ్చిబౌలి నుంచి లింగంపల్లి రోడ్డు వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలలో వెళ్లాలని పోలీసులు సూచించారు. 




 




 


Tags:    

Similar News