ఉన్నత విద్యామండలి ఛైర్మన్గా ప్రొఫెసర్ లింబాద్రి నియామకం

Update: 2023-06-26 15:03 GMT

తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌గా ప్రభుత్వం ప్రొఫెసర్‌ ఆర్‌.లింబ్రాదిని నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి వాకాటి కరుణ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన ఉన్నత విద్యామండలి ఇంఛార్జ్ ఛైర్మన్గా కొనసాగుతున్నారు. ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ గా పాపిరెడ్డి పదవీ కాలం ముగిసిన అనంతరం లింబాద్రి ఇంఛార్జ్ బాధ్యతలు స్వీకరించారు. తాజాగా ఆయనకు పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించారు. ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ గా ప్రొ. లింబాద్రి మూడేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు.

లింబాద్రి స్వస్థలం నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం రావుట్ల గ్రామం. దళిత కుటుంబంలో పుట్టిన ఆయన విద్యార్థి దశలో పీడీఎస్‌యూలో పనిచేశాడు. వివాదరహితుడిగా పేరున్న ఆయన ఆర్మూర్‌ డివిజన్‌లో రైతు కూలీ సంఘంలో పనిచేశాడు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఏ, పీహెచ్డీ పట్టా పొందిన ఆయన.. సికింద్రాబాద్‌ పీజీ కాలేజీకి వైస్‌ ప్రిన్సిపల్‌గా పనిచేశారు. తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గానూ బాధ్యతలు నిర్వహించారు. కొన్నాళ్లు ఉన్నత విద్యామండలి సభ్యుడిగా కొనసాగిన ఆయన.. అనంతరం రెండేళ్ల పాటు ఇన్‌చార్జ్ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. తాజాగా పూర్తి స్థాయిలో ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా బాధ్యతలు అప్పజెప్పడంపై పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News