KBCలో రేవంత్ రెడ్డిపై ప్రశ్న.. ఆన్సర్ చెప్పలేకపోయిన యువతి.. ఏమని అడిగారంటే?

By :  Bharath
Update: 2023-12-29 12:55 GMT

బిగ్ బీ అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా నిర్వహిస్తున్న కౌన్ బనేగా కరోడ్ పతి (KBC)లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ఓ ప్రశ్న అడిగారు. అయితే ఆ ప్రశ్నకు కంటెస్టెంట్ సరైన సమాధానం చెప్పకపోవడం గమనార్హం. ఈ నెల 15న ప్రసారమైన కేబీసీ ఎపిసోడ్ లో రూ.40 వేల ప్రశ్నగా ఓ యువతిని ఈ ప్రశ్న అడిగారు. రేవంత్ రెడ్డి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారని అడగగా.. ఆప్షన్స్ గా ఛత్తీస్ గఢ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ అని ఇచ్చారు.కానీ ఆ ప్రశ్నకు జవాబు చెప్పలేకపోయిన ఆ యువతి.. ఆలోచనలో పడింది. తర్వాత ఆడియన్స్ పోల్ తీసుకోగా.. వాళ్లలో ఎక్కువమంది తెలంగాణ అని సూచించారు. అది సరైన సమాధానం కావడంతో.. ఆమె తర్వాత ప్రశ్నకు అర్హత సాధించింది.




Tags:    

Similar News