సహనం కోల్పోయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. ఏసీపీని తిట్టిన వివేకానంద : MLA Vivekananda
అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆటో డ్రైవర్లకు మద్దతూ తెలుపుతూ...బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆటోలో అసెంబ్లీకి వచ్చారు. ఆటో కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్లకార్డులతో లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. అసెంబ్లీలోకి ప్లకార్డులు తీసుకెళ్లేందుకు అనుమతి లేదంటూ గేటు బయట వారిని ఆపేశారు. ఈ క్రమంలో కుత్భుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద పోలీసుల తీరుపై ఫైర్ అయ్యారు
లోపలికి అనుమతించాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో సైఫాబాద్ ఏసీపీని యూజ్ లెస్ ఫెలో అంటూ తిట్టారు. అంతేకాకుండా కారు అద్దంపై కర్రతో కొట్టారు. ఎమ్మెల్యే వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది. దీనిపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది ఉత్కంఠగా మారింది. కాగా ప్రభుత్వ నిర్ణయంతో ఆటో డ్రైవర్ల జీవితాలు రోడ్డున పడ్డాయని.. రెండు నెలల్లో 21 మంది డ్రైవర్లు ఆత్మహాత్య చేసుకున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఉచిత బస్సు మంచిదే కానీ ఆటో డ్రైవర్లను కూడా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. చనిపోయిన ఆటో కార్మికుల కుటుంబాలకు రూ. 10 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు.